ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధి వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో సోమవారం అర్ద రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసిన దొంగలు వరుసగా చోరీలకు పాల్పడ్డారు.
సుమారు రెండున్నర లక్షల మేరకు సొత్తు చోరీ అయినట్లుగా అంచనాగా చెప్తున్నారు వేల్పూర్ పోలీసులు గ్రామానికి వచ్చి చోరీ అయిన ఇండ్లను పరిశీలించారు క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు
