నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ కళ్ళుబట్టి వద్దగల దుకాణ సముదాయ బంగ్లా మెట్ల పైనుంచి అదుపుతప్పి కింద పడి యువకుడు మృతి చెందాడు.
మండల కేంద్రానికి చెందిన గొల్ల ముత్యం వయసు:25 కులము: గొల్ల, వృత్తి: కూలి, రాత్రి 10 గంటల సమయంలో నిర్మానుష్యంగా ఉన్న కల్లుబట్టి వెనకాల గల బంగ్లా మెట్లపై కూర్చుండి తాగిన మైకంలో అదుపుతప్పి కింద పడిపోయి చనిపోవడం జరిగింది.,
మృతుడి సోదరుని ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఈ బంగ్లాకు ప్రహరి గోడ లేకపోవడంతో, అలాగే కళ్ళు బట్టి పక్కనే ఉండడంతో మద్యం తాగే వారంతా
ఈ బంగ్లా మెట్లపై, బంగ్లా పై నిత్యం తాగి నానా హంగామా చేస్తారని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని, బంగ్లా ప్రహరీ గోడ నిర్మించుకునేలా, తాగుబోతుల అడ్డాగా మారకుండా చూడాలని, మహిళలు
ఆ రోడ్డు వెంబడి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, పోలీసులు గట్టి చర్య తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
