నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 8 నియోజకవర్గాల పసుపు రైతుల సమస్యను మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో శాసన సభ దృష్టికి తీసుకువెళ్లారు.
సాంగ్లీలో రూ.14 వేలకు అమ్ముడుపోతున్న పసుపు నిజామాబాద్ మార్కెట్లో రూ.8 నుంచి 9వేలకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు?. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. పసుపు రైతులను కాపాడవలసిందిగా కోరారు.
