అక్రమంగా ఎండు గంజాయినీ రవాణా చేస్తున్న ముఠా ను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని అర్సపల్లి ఎన్ ఎన్ ప్యాలెస్ మహమ్మద్ మునవార్, మహమ్మద్ ఇరాన్,అమీర్ పాషా,మహమ్మద్ అన్వర్ లు కలిసి అక్రమంగా కారులో ఎండు గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకొని వారి నుంచి 2 కిలోల 100 గ్రాములు ఎండు గంజాయినీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే కారు,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ దాడిలో సీఐ స్వప్న, ఎస్ఐ లు రామ్‌కుమార్, చారి , సిబ్బంది హమీద్, శివా, రాజన్న, భోమన్న, ఆశన్న, రాంబచన్, సాయిప్రసాద్ పాల్గొన్నారు.
