Tuesday, January 20, 2026
HomeCinemaఈడీ విచారణకు హాజరు అయినా విజయ్ దేవరకొండ

ఈడీ విచారణకు హాజరు అయినా విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్ బాగ్ లోని కార్యాలయంలో ఆయనను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం.  బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికాలు,కమిషన్ లపై అరా తీశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్‌చేసిన పలువురు సినీ ప్రముఖలకు జులై 21న ఈడీ సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో ఇప్పటికే  ప్రకాష్ రాజ్‌‌‌‌‌ జులై 30న  విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ లనుంచి పైసా తీసుకోలేదని తెలిపారు.

మళ్లీ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయబోనని చెప్పారు.ఈ కేసులో ఆగస్టు 11న రానా… 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!