దోమకొండ నుండి సంగమేశ్వర్ కు వస్తన్న ఓ కారు వరదలో కారు కొట్టుక పోయింది. ఆ కారులో ఇద్దరు కూడా గల్లంతు అయ్యారని సమాచారం.
సమీపంలో చెరువు కట్ట తెగి వరద నీరు రోడ్డుమీదికి వచ్చింది అదే సమయం లో వచ్చిన కారు వేగంగా ముందుకు వచ్చేయడంతో వరద మరింత పెరిగింది.
కారు ముందుకు కదలిక లేకపోయింది కారు లో ఉన్న వారు హాహాకారాలు చేయడంతో అప్రమత్తం అయిన అధికారులు వారిని కాపాడానికి జెసిబి తో వెళ్లారు.
కానీ అప్పటికే వరద ప్రవాహం మరింత ఉదృతం కావడంతో కారు కొట్టుక పోయింది. అందులో ఇద్దరు ఉన్నారని స్థానికులు చెపుతున్నారు … అంతకుముందు బైక్ పైన వస్తున్న వ్యక్తి సైతం కొట్టుకుపోయారని వారంటున్నారు
