బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలం విట్టోలి లో జరిగింది విట్టోలి గ్రామంలోని తన బంధువు కొండేకర్ బాలాజీ ఇంటికి ఇద్దరు బాలురు అతిథులుగా వచ్చారు.
వీరిలో ఒకరు తానూర్ మండలం కలూర్ గ్రామానికి చెందిన నికిల్ (15 ) కాగా..మరొకరు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన స్వరాజ్ (14 ). మే 11 న మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న రంగారి కుంట చెరువు వద్ద ఆడుకోవడానికి వెళ్లారు.
ఈ క్రమంలో అక్కడ ఉన్న లోతైన నీటి కుంటలో ప్రమాదవశాత్తు జారి పడ్డారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
