Monday, April 20, 2026
HomeTelanganaNizamabadమేయర్ గా ఉమారాణి ......డిప్యూటీ మేయర్ గా సాల్మా తాహిసిన్

మేయర్ గా ఉమారాణి ……డిప్యూటీ మేయర్ గా సాల్మా తాహిసిన్

నిజామాబాద్ నగర నాలుగో మేయర్ గా ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా సాల్మా తాహిసిన్ నియామకం అయ్యారు. మేయర్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ చివరి దాక ఉత్కంఠ కొనసాగించింది. గెలిచిన సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తీ కాగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మేయర్ అభ్యర్థి గా ఉమారాణి పేరును సీల్డ్ కవర్ లో నుంచి తీసి ప్రకటించారు.

ఉమారాణి 49 డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన తాహిసిన్ 52 డివిజన్ నుంచి యంఐయం అభ్యర్థి గా పోటీ చేసి గెలిచారు.. నిజామాబాద్ నగరమేయర్ పీఠం మహిళా జనరల్ అయింది.

కానీ అనూహ్యంగా బీసీ మహిళా కు మేయర్ పీఠం దక్కింది.మొదట వ్యాపార వేత్త నరేందర్ రెడ్డి సతీమణి సమంత ను మేయర్ అభ్యర్థిగాభావించారు కానీ కార్పొరేటర్ ఎన్నికలో ఓడిపోయింది. కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలిచారు కానీ మ్యాజిక్ ఫిగర్ కోసం 14 స్థానాలు గెలిచిన యంఐయం మద్దతు కూడగట్టారు.

మరో బిఆర్ ఆర్ యస్ సభ్యుడు మద్దతూ సైతం కాంగ్రెస్ కు ఇవ్వడంతో మెజార్టీ మార్క్ ను కాంగ్రెస్ దాటింది 28 మంది కార్పొరేటర్లు ముగ్గురు ఎక్స్ అఫిషియో బలం తో మేయర్ పీఠం చేరువైన బీజేపీ సంఖ్యా బలం లో వెనుకబడింది.

34 మంది సభ్యులతో కాంగ్రెస్ సులువుగా మేయర్ స్థానం దక్కించుకుంది 2005 తర్వాత కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కించుకుంది ……ఇద్దరు కార్పొరేటర్ల పేర్లు తెరమీదికి వచ్చాయని సమాచారం. 21 49 డివిజన్ కార్పొరేటర్ల పేర్లు తెర మీదికి వచ్చాయి.

21 కార్పొరేటర్ పంచరెడ్డి లలితా 49 డివిజన్ నుంచి కూరగాయల ఉమా రాణి లు గెలిచారు. వీరిలో మున్నారు కాపు కు చెందిన లలిత పంచరెడ్డి చరణ్ సతీమణి .చరణ్ సుదీర్ఘ కాలంగా యన్ యస్ యూ ఐ యూత్ కాంగ్రెస్ ల్లో పనిచేసారు.

ఆయనకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చే విషయంలోనూ మహేష్ తీవ్ర ఒత్తిళ్ల ను సైతం పక్కు పెట్టారు. అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి గెలిచారు. నగరంలో బలమైన సామజిక వర్గంగా ఉన్న మున్నారు కాపు లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ సీనియర్ నేతల్లోఉంది మరో వైపు ఉమారాణి భర్త కరాటే రమేష్ సైతం సుదీర్ఘ కాలంగా పార్టీ లో పనిచేస్తున్నారు అదీగాక పీసీసీ చీఫ్ మహేష్ తో నాలుగున్నర దశాబ్దాలుగా దోస్తాని ఉంది.

అందుకే మహేష్ కూడా ఆయన వైపు మొగ్గు చూపే ఛాన్స్ లేకపోలేదు అదీగాక ఇప్పటిదాకా ముదిరాజ్ సామజిక వర్గం కు కీలక మైన అవకాశాలు కూడా రాలేదని మేయర్ అవకాశం ఆ వర్గం కు ఇస్తే కొత్త సామజిక ప్రయోగం చేసినట్లు అవుతుందనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉండే అదీగాక ముదిరాజ్ వర్గానికి లోకసభ పరిధి లో ఎక్కడా కీలక పదవి సర్దుబాటు చేసే పరిస్థితి లేకుండా పోయింది నగరంలో ముదిరాజ్ ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉమారాణి పట్టం కట్టింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!