ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ ను పలు జర్నలిస్ట్ సంఘాలు ఘనంగా సన్మానించాయి .71వ వసంతంలోకి అడుగుపెడుతూ, జర్నలిజం వృత్తిలో మరియు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో విజయవంతంగా అర్ధ శతాబ్ద కాలం పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంలో సోమవారం రాత్రి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు ప్రధాన కార్యదర్శి డి. సోమసుందర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు మాజీద్, జాతీయ ఉపాధ్యక్షులు వై. నరేందర్ రెడ్డి, TUWJ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.విరాహత్ అలీ, కె.రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కిరణ్ కుమార్, అనీల్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎ. రాజేష్, తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హరి, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరీష్, సన్నీ, గౌరవ అధ్యక్షులు నాగరాజు, JNJ హౌజింగ్ సొసైటీ డైరెక్టర్ నేమని భాస్కర్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, తెలంగాణ వయోధిక జర్నలిస్టుల సంఘం బాధ్యులు శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు..
