HomeDevotionalనరసింహ జయంతి వేడుకలో అర్బన్ ఎమ్మెల్యే...

నరసింహ జయంతి వేడుకలో అర్బన్ ఎమ్మెల్యే…

నరసింహ జయంతిని పురస్కరించుకొని గురువారం నగరంలోని పలు ఆలయాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. మల్లారంలోని గత మందిరంలో నిర్వహించిన నరసింహ స్వామి డోలారోహణ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వినాయక్ నగర్ లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. హోమం, అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

స్వామి వారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments