పార్టీ వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడుతున్నరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
రెండు మూడు నెలల క్రితం వడ్డేపల్లి సుభాష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ రావు పై, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడాలని క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై క్రమశిక్షణ సంఘం వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి నవంబర్ 21 2024లో షోకాజ్ నోటీసు జారి చేసింది. దీనిపై వడ్డేపల్లి ఈనెల 29వ తేదీన వివరణ సైతం ఇచ్చుకున్నారు.
కాగా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని సుభాష్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తున్నట్లు చెన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు. సుభాష్ రెడ్డి ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందడం లేదని, ఇకనుంచి ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం ఉండదని, సుభాష్ రెడ్డికి పంపిన లేఖలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు.
