HomeLaw and Orderవైశ్యసంఘం ఎన్నికలఫై రగడ .....పోలింగ్ అక్రమాలు మీద కోర్టులో కేసు ......స్టే ఇచ్చిన జిల్లా కోర్టు

వైశ్యసంఘం ఎన్నికలఫై రగడ …..పోలింగ్ అక్రమాలు మీద కోర్టులో కేసు ……స్టే ఇచ్చిన జిల్లా కోర్టు

అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన వైశ్య సంఘం ఎన్నికల వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీ తలపడిన ఎన్నికల ఫై న్యాయ వివాదం తలెత్తింది.

పోలింగ్ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఓ వర్గం కోర్టు ను ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా న్యాయ స్థానం ఫలితాల మీద స్టే ఇచ్చింది. దీనితో వైశ్య సంఘం లో కలకలం రేగింది.

సబ్యులకు సరాసరిగా 2400 వోట్లు పోలు అవుతే అధ్యక్ష పదవులకు 3800 దాక వోట్లు పోలు అయ్యాయి ఇంత వ్యత్యాసం ఫై అభ్యంతరాలు వెలువెత్తాయి. అదే అంశం ను న్యాయ వాదులు ప్రదానంగా ప్రస్తావించారు.

నిజామాబాద్ నగర ఆర్యవైశ్య సంఘానికి చెందిన ఆరు అనుబంధ సంస్థలలో ఇటీవల నిర్వహించిన ఎన్నికలు. మొత్తం ఆరు సంఘాల్లో రెండు సంఘాల అధ్యక్షులు ఏకగ్రీవంగా జరిగాయి ..

మిగతా నాలుగు అనుబంధ సంఘాల్లోని అధ్యక్ష పదవుల కోసం ఉత్కంఠభరితంగా ఎన్నికలు సాగాయి. అయితే పోలింగ్ సమయంలో ఏర్పడ్డ కొన్ని అవాంఛనీయ పరిణామాల వల్ల ఎన్నికల అధికారులు కొంత సహకరించకపోవడం, గొడవలు జరగడం కారణంగా కౌంటింగ్ పక్రియ ను మూడు రోజుల పాటు నిలిపి వేశారు వారం రోజుల అనంతరం అధ్యక్ష, కార్యవర్గ అభ్యర్థులు ఎన్నికల అధికారులతో జరిపిన చర్చల తరువాత తిరిగి కౌంటింగ్ ప్రారంభమైంది.

మొత్తం 10,017 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా, ఈసారి పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదై, 3,000 కన్నా తక్కువ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి.

కానీ పోలింగ్ ఏ మేరకు జరిగింది ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటించక పోవడం ఎన్నికల అధికారి అడ్రస్ లేకుండా పోవడం.

బ్యాలెట్ బాక్స్ లకు సరైన సీల్ వేయక పోవడం వంటి అంశాలు ఎన్నికల నిర్వహణ మీద అనుమానాలు కలిగించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments