కేశపూర్ లోని మహాలక్ష్మి ఆలయంలోనీ బంగారు పుస్తెలు, పంచలోహ వినాయకుని విగ్రహము మరియు హుండీలో డబ్బులు చోరి చేసినట్లు ఎస్ఐ అరీఫ్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
గుంజ గంగాధర్ ఈనెల 23 న కేశపూర్ లోని మహాలక్ష్మి ఆలయంలోకి చొరబడి చోరికి పాల్పడినట్లు తెలిపారు.
ఈమేరకు గురువారం నిందితుడిని పట్టుకొని వినాయకుని పంచలోహ విగ్రహం, బంగారు పుస్తెలు రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మరో నేరస్థుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
