వేధింపులకు గురైన బాధిత మహిళలు, పిల్లలకు బాసటగా, వారికి న్యాయం అందించటానికి ‘భరోసా’ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
బాధిత మహిళలకు మరియు పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుందన్నారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో, రేప్ కేసులలో ఏడు మంది బాధిత పిల్లలకు, మహిళలకు భరోసా కేంద్రంతరపున చెక్కులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనో-ధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటనీ అన్నారు.
బాధిత మహిళలకు, పిల్లలకు ఆర్ధిక సాయం కోసం భరోసా కేంద్రం తరపున చెక్కులు అందజేయడం ద్వారా వారి పునర్వాసానికి మనదైన తోడ్పాటు అందించినందుకు సంతృప్తిగా ఉంటుందని తెలిపారు.
ప్రతీ మహిళాలు, పిల్లలు భద్రతగా, గౌరవంగా జీవించాలన్నదే మా అభిలాష భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధి-తుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం అని తెలియజేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ జి. రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పుష్పావతి, మౌనిక, సవిత, ఎ.ఎన్.ఎమ్లు తదితరులు పాల్గొన్నారు.
