విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని , ఉద్రిక్తత..తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్ జన్నారపు రాజేశ్వర్ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ గౌడ్ ఇంటిని ముట్టడించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడిఎస్ యూ, ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇల్లు ముట్టడి చేయటం జరిగింది.పోలీసులకు విద్యార్థి నాయకులకు తోపులాట జరిగింది.
అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి 4 వ టౌన్ కి తరలించటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ గౌతమ్ కుమార్ ,జన్నారపు రాజేశ్వర్ లు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని, మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ స్కూల్స్ డేంజర్ జోన్ లో ఉన్నాయని, గత నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ బకాయిలు 8000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నూతన జాతీయ విద్య విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, నర్సరీ నుండి ఇంజనీరింగ్ వరకు ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అన్నారు.
ఖాళీగా ఉన్న డిఇఓ , ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తీక్,సహాయ కార్యదర్శి ప్రిన్స్ , జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పీడీఎస్ యూ జిల్లా నాయకులు మనోజ్,సాయినాథ్,రాహుల్,శ్రీకాంత్, పీడీఎస్ యూ నగర నాయకులు సాయికిరణ్, దుర్గాప్రసాద్, ఏఐఎఫ్డిఎస్ నాయకులు మోసిన్,సాయి,మధు తదితరులు పాల్గొన్నారు.
