HomePOLITICAL NEWSదళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించేదాక పోరాడతాం..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించేదాక పోరాడతాం..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వ్యతిరేకి కాంగ్రెస్‌ను గద్దె దించుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో సాయిలుకు జరిగిన అవమానానికి నిరసనగా శుక్రవారం ఆత్మ గౌరవ గర్జన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లింగంపేటలో అంబేద్కర్ జయంతి రోజున సాయిలు పై దాడికి బదులు తీర్చుకుందామని పేర్కొన్నారు.

అబ్బెద్కరవ్ను గౌరవించిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే అని అన్నారు.దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.దళిత డిక్లరేషన్ లో ప్రకటించింది ఏడు చేయలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళ్తున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అడబిడ్డలు, పిల్లలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తానే ఇచ్చానని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ హయాంలో అప్పులు ఉన్నప్పటికీ ఏ సంక్షేమ పథకం కూడా ఆగలేదని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. నడిపేటోడికి దమ్ముంటే ఆదాయం పుడతదని, పనులు కూడా పర్తవుతాయని చెప్పారు.

గురుకులాల్లో విషం పెడుతున్నారని, వందల మంది ప్రాణాలు తీశారని ఆరోపించారు. 6.50 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన భోజనం అందడం లేదని విమర్శించారు.

ప్రపంచ సుందరాంగులకు ప్లేట్‌ భోజనం కోసం రూ.లక్ష ఖర్చు చేశారని కానీ చిన్నారులకు మాత్రం భోజనం పెట్టేందుకు వెనుకాడుతున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments