HomeLaw and Orderఐడీఓసీ లో "వందేమాతరం" సామూహిక గీతాలాపన..

ఐడీఓసీ లో “వందేమాతరం” సామూహిక గీతాలాపన..

“వందే మాతరం” జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకిమ్‌ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటారు. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు.

సామూహిక గీతాలాపనలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments