HomeLaw and Orderయునివర్సిటీ ని వదలని వివాదాల తుట్టె ...అధికారులకు చెంప పెట్టుగా హైకోర్టుతీర్పు ........ ఓ...

యునివర్సిటీ ని వదలని వివాదాల తుట్టె …అధికారులకు చెంప పెట్టుగా హైకోర్టుతీర్పు …….. ఓ ఆచార్యుని నిర్వాహకమే

తెలంగాణ యూనివర్సిటి ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2012 లో జరిగిన నియామకాలు చెల్లవంటూ హైకోర్టు సంచలన తీర్పు అధికారులకు చెంప పెట్టుగా మారింది. ప్రసుతం యునివర్సిటీ లో కీలక స్థానం లో ఉన్న ఓ ప్రొపెసర్ నిర్వాహకం వల్లే నాటి నియామకాల పక్రియ లో విచ్చల వీడి అవినీతి జరిగింది.

ఎంతో మంది అర్హులైన వారు ఉన్నాసరే నిబంధనలు పాతరేసి నియామకాలు చెప్పట్టారు. తీవ్ర దుమారం చెలరేగింది. చివరికి సీఎంవో సైతం రంగంలోకి దిగింది. అయినప్పటికి యునివర్సిటీ అధికారుల బరితెగించడం తో అర్హులైన అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు 2013 లో దాఖలైన పిటిషన్ మీద జస్టిస్ బీమాపక నగేష్ ధర్మాసనం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది.

2012 లో అప్పటి వైస్ ఛాన్స్ లర్ అక్బరోద్దిన్ యూనివర్సిటి లో నియామకాలు చేపట్టారు. నియామకాలు భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ పిర్యాదు లు వెల్లువెత్తాయి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దాక వెళ్లాయి కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు అయినప్పటికి అభ్యర్థులకు నియామకం ఉత్తర్వ్యూలు ఇచ్చారు.

దీనితో నియామకాల ను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ వాదనలు జరిగాయి. నియామకాల్లో రోస్టర్ పాటించలేదని హైకోర్టు పేర్కొంది.

అయితే ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని నిబంధనలు తొక్కేశారని పిర్యాదు లు వెల్లు వెత్తాయి కానీ ఓ ప్రొపెసర్ తెరవెనుక మంత్రాంగం నడిపి వైస్ ఛాన్సలర్ ను ముందు పెట్టి పెద్దఎత్తున వసూళ్ల దందా కు తెరలేపి నియామక ఉత్తర్వ్యూలు ఖరారు చేసారు.

దీనితో యునివర్సిటీ లో ప్రొపెసర్లు అసిస్టెంట్ అసోసియేట్ లు లక్షలాది రూపాయలు ప్రతినెలా వేతనాల రూపేణా లబ్ది పొందారు ఇప్పడు హైకోర్టు ఈ నియామకాలు చెల్లవంటూ స్పష్టం చేసింది. కానీ ఇప్పటిదాకా దాక వీరు తీసుకున్న వేతనాల మాటేమిటి ???

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments