HomeTelanganaNizamabadడాక్టరేట్ పట్టాను అందుకున్న డి.ఎస్.పి అభినందించిన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్

డాక్టరేట్ పట్టాను అందుకున్న డి.ఎస్.పి అభినందించిన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్

తెలంగాణా విశ్వవిద్యాలయంలో జరిగిన రెండవ స్నాతకోత్సవంలో 2011 – 2012 అకాడమిక్ ఇయర్ సంబంధించిన పీహెచ్డీ పరిశోధకులకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ చేతుల మీదుగా ఆర్జీయూకేటీ బాసరలో సియస్ఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ డి. రాజేష్ కి డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డి ప్రొఫెసర్ మురళీధర్షన్ డాక్టర్ డి. రాజేష్ డిఎస్పి ని అభినందించారు.

ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా విధులు నిర్వహిస్తూనే 5 మాస్టర్ డిగ్రీలు ఎం. ఏ తెలుగు, ఎం. ఏ హిస్టరీ, ఎం. ఏ హ్యూమన్ రైట్స్, ఎం. ఏ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లతోపాటు పరిశోధన చేయాలని మక్కువతో తెలంగాణలోని మథుర బంజారాలపై భారత దేశంలోనే మొట్ట మొదటి పరిశోధన చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు.

ఈ పరిశోధన తెలంగాణ రాష్ట్రంలో పరిశోధన చేస్తున్న పరిశోధకులకు ఇదే ప్రామాణిక పరిశోధనగా నిలుస్తుందని కొనియాడారు. విద్య పట్ల ఆసక్తితో ప్రస్తుతం ఎల్.ఎల్.బి కోర్సును కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ డి రాజేష్ డిఎస్పి మాట్లాడుతూ విసి ప్రొఫెసర్ గోవర్ధన్ ఓఎస్డి ప్రొఫెసర్ మురళీధర్షన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉన్నత స్థాయిలో ఎదగడానికి నిరంతరం ప్రోత్సహించిన నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను నడిపిస్తున్న నా భాగస్వామి ప్రొఫెసర్ లావణ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నా జీవితానికి క్రమశిక్షణనేర్పి బలీయమైన పునాది నిర్మించిన మహామహుడు మంత్రిప్రగడ శ్రీధర్ రావు,మానవత్వంతో, దృఢ సంకల్పంతో క్వాలిటీగా జీవించాలని నాగుండెకు పట్టుదలను నేర్పిన కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి,మనసుతో , మమతతో ,ఆత్మీయతతో ఉంటూ ప్రకృతితో మమేకమై సర్వోన్నతంగా జీవించాలని నా జీవితాన్ని మలుపుతిప్పిన ఆధ్యాత్మిక గురువు శ్రీరామ్ సార్, నా ఉన్నతికి, నా అత్యున్నత Ph.D డిగ్రీ అందుకొనడానికి ముఖ్యమైన కారకులు మధుర లాభాన్ బంజారా జాతికి, నా మిత్రుడు, నా క్లాస్మేట్ తెలంగాణలోని 80 వేల మథుర లాభాన్ తెగ రాష్ట్ర అధ్యక్షులు బస్సి తాన్సింగ్ కి ప్రతీ అన్నా తమ్ముడు అక్కా చెల్లెళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments