HomeTelanganaNizamabadగులాబీ పార్టీలో అగ్ర నేతల మధ్య ఆధిపత్య పోరు .......అధినేత కు దూరం అయిన దూకుడు...

గులాబీ పార్టీలో అగ్ర నేతల మధ్య ఆధిపత్య పోరు …….అధినేత కు దూరం అయిన దూకుడు నేత ……ప్రశాంతంగా పావులు కదిపిందెవరో ?

అధికారం కోల్పోయిఏడాదిన్నర కావొస్తున్నా గులాబీ పార్టీ ఇంకా ప్రజాక్షేత్రంలోకి రాలేక పోతున్నారు.అధికార అండ తో చెలరేగిపోయిన ఎమ్మెల్యే ఒక్కసారి ఓడి పోవడంతో ఇంకా షాక్ నుంచి కోలుకోవడం లేదు నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు.

దీనికి తోడు జిల్లా పార్టీ లో అగ్ర నేతల మధ్య ఆధిపత్య పోరు పరాకాష్ట కు చేరింది. పార్టీ పెద్దల కొటారి లో ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు రసకందాయం లో పడింది.

కెసిఆర్ అత్యంత దగ్గర గా ఉన్న ఓ యువ నేత లక్ష్యంగా మరో నేతతో కలసి తెరవెనుక పావులు కదిపి అక్కడి నుంచి కదిపేసారని సమాచారం. ప్రశాంతంగా ఆపరేషన్ పూర్తీ కావడంతో ఇప్పడు ఆ నేతే కెసిఆర్ కు చేరువయ్యారు. జిల్లా పార్టీ లో ఈ పరిణామాలు హాట్ టాపిక్ గా మారింది.

జిల్లాకు చెందిన ఇద్దరు అగ్ర నేతలే కెసిఆర్ కుటుంబానికి అత్యంత సన్ని హితులుగా ముద్ర ఉంది. ఒకరు కేటీఆర్ కొటారి లో వుంటే మరొకరు సంతోష్ రావు తో కలిసి కెసిఆర్ కు అత్యంత సమీపంలో ఉంటారనేది పార్టీ వర్గాలకు అందరికి తెలిసిన విషయమే! పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల ఈ ఇద్దరు నేతలు సాగించిన హవా అంతా ఇంత కాదు.

జిల్లాలో మిగితా ఎమ్మెల్యే లు రగిలి పోయేది.తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో తెలిసేది కాదు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేటీఆర్ కొటారి లో ఉన్న నేత తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వంక తో సీఎం గా ఉన్న కెసిఆర్ చెంత కు చేరారు.

పూర్తీ గా కెసిఆర్ నే అనుచరించారు. కానీ అప్పటికే అక్కడ తిష్ట వేసి ఉన్న మరో నేత ఇది ఏ మాత్రం మింగుడు పడలేదు. దానికి తోడు సంతోష్ రావు సైతం ప్రతికూల పరిస్థితుల్లో ఉండడంతో నిస్సహాయుడయ్యాడు.

దానికి తోడు ఎన్నికలు సమీపించడం తో సదురు నేత కెసిఆర్ కొటారి వ్యవహారాలు వదిలేసి నియోజకవర్గం కు పరిమితం అయ్యారు. అధికారం కోల్పోవడంతో కెసిఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కాగ బిఆర్ యస్ అగ్ర నేతలు హైదారాబాద్ కు పరిమితం అయ్యారు.

కానీ కొద్దిరోజులకే ఈ ఇద్దరు నేతలు మధ్య మళ్ళీ ఆధిపత్య పోరు మొదలయ్యింది. ఎమ్మెల్యే గా ఓడిపోయిన యువనేత ను రేవంత్ అధికార పార్టీ టార్గెట్ చేసింది ఆయన ఆస్తులను లక్ష్యంగా చేసుకొని అనేక కేసు లు నమోదు అయ్యాయి.

మొదట ఉక్కిరి బిక్కిరి అయిన సదురు నేత బీజేపీ కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలతో మునుపటి దూకుడు మొదలు పెట్టాడు.నియోజకవర్గంలోనూ పట్టు కోసం పావులు కదపడం మొదలు పెట్టాడు.

కానీ సంతోష్ రావు మరోసారి కెసిఆర్ వద్ద యాక్టివ్ కావడంతో సమీకరణాలు తలకిందులయ్యాయి. యువనేత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.

కెసిఆర్ ఉండే ఫామ్ హౌస్ విషయాలు బయటికి వెళ్తున్నాయనే చర్చ పార్టీలో చాల రోజులు సాగాయి.ఈక్రమంలోనే యువనేత లక్ష్యంగా చేసుకొని పావులు కదిలాయి. జిల్లాకు చెందిన మరో అగ్ర నేతే తెరవెనుక నుంచి వ్యూహాత్మకంగా పావులు కదిపి సదరు నేత ఫామ్ హౌస్ రాకుండా కట్టడి చేసారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments