పోలీసుల అదుపులో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు – ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటిదగ్గర స్వల్ప లాఠి చార్జ్- వేల్పూర్ కు పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు
– ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటికి నిరసన తెలిపేందుకు వచ్చిన ఎన్నారై సెల్ రాష్ట్ర నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి – నెలకొన్న ఉద్రిక్తత జాన రమేష్ ఇది సంగతి ఆర్మూర్ కనువిప్పు పేరుతో కాంగ్రెస్ చలో వేల్పుర్ కు పిలుపునివ్వడంతో…
తాము సైతం సిద్ధమంటూ కయ్యానికి టిఆర్ఎస్ నేతలు కాలుదువ్వడంతో వేల్పూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వేల్పూర్ వీధులలో మోహరించాయి.
దొరికిన వారిని దొరికినట్టు పోలీసులు అదుపులకు తీసుకుంటూ వాహనాలలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల కళ్ళు కప్పి గ్రామ నడిబొడ్డుకు స్థానిక టిఆర్ఎస్ నాయకుడు రేగుల్ల రాములు తరలివచ్చి రేవంత్ సర్కార్ కు నిరసనగా నినాదాలు చేస్తూ బైఠాయించాడు.
అలాగే మరోవైపు అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రామ నడిబొడ్డుకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తల్లి వచ్చేందుకు ఎత్నించగా పోలీసులు అడ్డుకొని వాహనాలలో తరలించారు.
పోలీస్ వాహనానికి స్థానిక వేల్పూర్ మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు స్వరూప అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే ఎన్ఆర్ఐ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి పైకి రావడంతో అక్కడే ఉన్న టిఆర్ఎస్ నాయకులు అతనిపై దాడికి దిగారు.
దీంతో స్వల్ప లాటి చార్జ్ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా భూమి కూడిన టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఎక్కడ వారు అక్కడ వెళ్లిపోవాలని ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
ఇంకా వేల్పూర్ లో ఉద్యత కొనసాగుతూనే ఉంది…మానాల, సునీల్ రెడ్డి, అన్వేష్ రెడ్డిల హౌస్ అరెస్ట్ మోర్తాడు ప్రధానిలయంలో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
వేల్పూర్ కనువిప్పు కార్యక్రమానికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ప్రజా నిలయం కు రాకుండా అడ్డుకున్నారు.హైదరాబాదులో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మండల మోహన్ రెడ్డిని నిజామాబాద్ లో హౌస్ చేశారు
