అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.
అసిస్టెంట్ కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ లోని భజబి
అహ్మద్ బేగం ఇంట్లో విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించి 450 గ్రాముల గంజాయి,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అహ్మద్ బేగం గత సంవత్సరం నుంచి ఎండు గంజాయినీ రహస్యంగా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ నరసింహచారి, రామ్ కుమార్, రాజన్న,భీమన్న, శ్రీను ప్రసాద్,భోజన్న, హమీద్, శివ, గంగారం, శ్యాంసుందర్, సాయి కుమార్, సుకన్య, మంజుల, పాల్గొన్నారు.
