VDC ల పేరుతో చేస్తున్న కొందరి ఆగడాలను నిలువరించాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తాళారాంపూర్ గ్రామానికి చెందిన 39 గౌడ కుటుంబ బాధితులు , 10 ఎస్సీ కుటుంబాలు కలిసారు. 22 సెప్టెంబర్ 2026 నాడు గ్రామ అభివృద్ధి కమిటీ వారు సాంఘిక గ్రామ బహిష్కరణ చేశారు.
ఈ గ్రామ బహిష్కరణ ఇది రెండవ సారి చేయడం జరిగింది. గ్రామం మొత్తం నిన్నటి నుండి బహిష్కరణ చేసిన కుటుంబాలకు సహాయ నిరాకరణ చేస్తూ ఎవరు కూడా మాట్లాడకుండా కిరాణా కొట్టులలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆంక్షలు విధించారు.
ఎవరైనా వారు చెప్పిన మాటను వినకుండా వారితో మాట్లాడిన సరుకులు ఇచ్చిన వారికి 25 వేల రూపాయల జరిమానా తీస్తామని VDC హుకుం చేసింది. గ్రామ అభివృద్ధి కమిటీ వారు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని కమీషనర్ కి తెలియజేయడం జరిగింది.
ఈ గ్రామ బహిష్కరణకు ప్రధాన కారకులు గ్రామ అభివృద్ధి కమిటీతో పాటు ఆవుల దేవన్న, ఇట్టేడి రాజకుమార్ రెడ్డి ,నాగులపల్లి అంజిరెడ్డి, క్యాతం దేవేందర్, క్యాతం గంగాధర్ తుమ్మల ఆనంద్ , తమ్మడి రాజేష్ , పోతుగంటి ఊషన్న , ఇంకా తదితరులు ఉన్నారు.
కావున పై బహిష్కరణకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి వారిపై చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతూ తాళ్ళరాంపుర్ కల్లుగీత కార్మిక సంఘం మరియు బాధిత గౌడ కుటుంబాలు , ఎస్సీ కుటుంబాలు వాపోయారు.
