హిజ్రాలు తమ గ్రామాల్లోకి రావద్దంటూ గ్రామ అభివృద్ధి కమిటీలు ఆంక్షల అస్రాలను సంధిస్తున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు సమావేశాలు నిర్వహించి హిజ్రా ఎంట్రీ నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు.తమ ఉపాధి అవకాశాలు దెబ్బతీసేలా గ్రామ అభివృద్ధి సంఘాలు వ్యవహరిస్తున్నాయని హిజ్రాలు ఆందోళన బాట పట్టారు .ఈ మేరకు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేవలం అనుమానాలు, అసత్య ప్రచారాలతో తమ మీద భౌతిక దాడులకు దిగడం, సామాజికంగా బహిష్కరించడం చేస్తున్నారని తెలిపారు.
ఇటీవల సిరికొండ మండలం మైలారం గ్రామంలో హిజ్రాలు చిన్న పిల్లలను అపహరిస్తున్నారనే తప్పుడు ప్రచారంతో వారిపై భౌతిక దాడులు జరిగాయి. అయితే, ఇవన్నీ కేవలం పుకార్లేనని, ఇందులో వాస్తవం లేదని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు నందిపేట మండలం హుస్నాపూర్‌లో కొందరు హిజ్రాలను గ్రామ పంచాయతీలో అక్రమంగా నిర్బంధించి, వారిని భయాందోళనకు గురిచేశారు.మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో ‘హిజ్రాలకు ప్రవేశం లేదు’ అంటూ బహిరంగంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసారు. హిజ్రాలను ధర్పల్లి గ్రామంలోకి అనుమతించవద్దని గ్రామ కమిటీ సభ్యులు ఏకంగా సోమవారం స్టేషన్ కు వెళ్లారు పోలీసులకు వినతి పత్రం అందిoచారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు కొమిరే గంగాధర్ ఆధ్వర్యంలో సభ్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి హిజ్రాలను రానివ్వదని వివరించారు. అంతకు ముందు బడా బీమ్ గాల్ లోనూ ఇదే తరహాలో గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానించింది
సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఓ బాలుడిని కిడ్నాప్ నకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. నిజానికి శుభకార్యాల్లోముఖ్యంగా పెండ్లిలు గృహ ప్రవేశాలు వంటి కార్యాలకు హిజ్రా అలజడి రివాజుగా మారింది. 10 నుంచి 15 మంది దాక వెళ్తున్న హిజ్రా లు ఇంటిముందే మకాం వేసి పాటలు పడుతూ డ్యాన్స్ లు వేస్తూ అలరిస్తున్నారు కానీ ఇచ్చినంత తీసుకోని వెళ్లకుండా వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అడిగినంత ఇవ్వకుండా బీభత్సం చేస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి.
గతంలో ఇదో , భిక్షాటన తంతు లగే సాగేది కానీ క్రమేపీ డిమాండ్ చెయ్యడం లేదంటే అల్లరి చేయడం వల్లే వివాదాలు తలెత్తుతున్నాయి గతంలో సామాజిక వర్గాలపై బహిష్కరణ వేటు వేసిన వీడీసీలు, ఇప్పుడు ట్రాన్స్‌జెండర్లను లక్ష్యంగా చేసుకోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న గ్రామ కమిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌జెండర్లు కోరుతున్నారు. మేము కూడా ఈ సమాజంలో భాగమే. మాపై దాడులు ఆపాలి, మాకు సామాజిక భద్రత కల్పించాలి. విద్వేషం నింపే పోస్టర్లు తొలగించి, మాపై తప్పుడు కేసులు పెట్టే వారిని శిక్షించాలి.” అని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
