భారత దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని ఇంకా ముందుకు వెళ్లాలంటే బీజేపీ కి ఓటెయ్యాలి నాలుగువందల దాటాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలునిచ్చారు. లోకసభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న వెలుబడుతున్నాయని బీజేపీ నాలుగువందల సీట్లు సాధిస్తామన్నారు. జగిత్యాల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. బీజేపీ కి ఓటెయ్యాలి నాలుగువందలు దాటాలి అంటూ తెలుగు లో మాట్లాడి ప్రజలను ఉత్సహపరిచారు. తెలంగాణ లో బీజేపీ గాలి వీస్తోందని ఈ గాలి లో బిఆర్ యస్ కాంగ్రెస్ పార్టీలు నిలువలేవన్నారు.
మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణ సెంటి మెంట్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన బిఆర్ యస్ పదేళ్లు దోచుకుందని కాళేశ్వర్ లోనే కాదు చివరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనూ కమిషన్ లకు కక్కర్తి పడ్డారని గుర్తు చేసారు. తెలంగాణ ప్రజలతో విశ్వాస ఘాతానికి పాల్పడిందన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను ఏటియం గా మార్చుకుందని ఇక్కడి సొమ్ము దోచి ఢిల్లీ కి తరలిస్తున్నారని ఆ సొమ్ము కుటుంబ ఖజానా కు చేరుతుందని ఆ సొమ్ముతోనే కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు . బిఆర్ యస్ అవినీతి మీద కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మౌనంగా ఉండిపోయిందన్నారు. కాళేశ్వర్ లో నిధులు దుర్వినియోగం అయిన కాంగ్రెస్ అడగలేక పోతుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయలేక పోతుందని అయినా బిఆర్ యస్ నిలదీయలేక పోతుందన్నారు. తెలంగాణలో బిఆర్ యస్ కాంగ్రెస్ పార్టీలు లోపాయికారిగా చేతులు కలిపాయన్నారు. ఒకరి అవినీతి మీద మరొకరు నోరువిప్పడం లేదన్నారు. కానీ ఇద్దరు కలిసి రోజు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో దోచుకున్న వారిని తాము వదలబోమని ఇదే మోడీ గ్యారెంటీ అన్నారు. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచామన్నారు.
ఇక్కడి ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్ల తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేస్తామన్నారు. తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు.దేశంలో కుటుంబ పార్టీల వల్ల ఎంతో నష్టపోయిందని అనేక భారీ కుంభకోణాలు కుటుంబ పార్టీలే చేశాయన్నారు.వీరిని దూరంపెట్టాలని కోరారు. ఎంపీ అర్వింద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఎమ్మెల్యే లు దన్ పాల్ సూర్యనారాయణ ,రాకేష్ రెడ్డి లు పాల్గొన్నారు





