గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేది లెఫ్ట్‌నెంటర్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె 2019 తెలంగాణ గవర్నర్ గా నియామకం అయ్యారు.కానీ సీఎం కెసిఆర్ తో ఆమె విభేదాలు వచ్చాయి. కానీ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సానుకూల సంబంధాలు ఏర్పడ్డాయి.
కానీ అనూహ్యంగా ఆమె దృష్టి రాజకీయాల వైపు మళ్లింది తమిళనాడులోని చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారీల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్‌సభకు పోటీ చేయబోతున్నతమిళిసై సొంత జిల్లా.. అంతేకాకుండా కన్యాకుమారి, తిరునల్వేలిలో అధికంగా నాడార్ ఓటు బ్యాంక్ ఉండటంతో ఈ స్థానాల్లో ఒకచోట తమిళిసై పోటీచేయనున్నారు.2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళిసై డీఎంకే అభ్యర్థి కనిమొజీ చేతిలో ఓటమి పాలయ్యారు..