భానుడు నిప్పులు చెరుగుతున్న సరే వోటర్లు లెక్క చేయడం లేదు …పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలో సోమవారం జరుగుతున్న పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకే 45 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
పట్టణ ప్రాంతంలో కన్న గ్రామీణ ప్రాంతాల్లోనే వోటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. నిజామాబాద్ అర్బన్ లోనే అత్యల్పంగా 38 శాతమే పోలింగ్ నమోదు అయింది. మండుటెండలో లోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం అందులోనూ ఉక్కపోత తోనే క్యూ లైన్ లో నిలబడడం గమనార్హం.
తీవ్రమైన ఎండల ను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల్లో టెంట్ లు వేసినప్పటికీ వోటర్ల ఎండ సెగ కు తాళలేక పోయారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంతో వోటర్లు ఉపశమనం పొందారు. నిజామాబాద్ నగరంలో విద్యావంతులు ఉన్న ప్రాంతాల్లోనే పోలింగ్ ఆశించినమేరకు జరగడం లేదు.
పేద ప్రజలుండే ప్రాంతాల్లోమాత్రం పోలింగ్ కేంద్రాలు వోటర్ల కిక్కిరిసి పోయాయి. నిజానికి వోటు చైతన్యం మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే వికసించింది. ఉదయం పోలింగ్ మొదలైన రెండు గంటలు ……13 శాతమే 9 తర్వాత కానీ అనూహ్యం పెరుగుతూ వచ్చింది మరో వైపు ప్రముఖులు కూడా ఓటర్లకు స్ఫూర్తి నింపేవిధంగా ఉదయమే వోట్లు వేశారు.
సోమవారం ఉదయం మొదలైంది 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం అరగంటల దాక సాగనుంది.నిజామాబాద్ నగరంలో పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ స్థానిక బాల్ భవన్ లో ఎంపీ అర్వింద్ కాకతీయ కాలేజీ లో వోటు వేశారు.
నిజాంబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి 29 మంది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నిజాంబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 17 04 867 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నియోజకవర్గ మొత్తంలో1808 ఏర్పాటు చేశారు. 7773 సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
ముందు బౌలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే పోలింగ్ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అటుదిటమైన భద్రత ఏర్పాటు చేసింది జిల్లా వ్యాప్తంగా సుమారు 57 కెమెరాలను ఏర్పాటు చేసింది ముఖ్యంగా సమస్య ఆత్మక ప్రాంతాలుగా ఉన్న పోలింగ్ కేంద్రాలలో బందోబస్తున సీనియర్ పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.జిల్లా లో ఉదయం 11 గంటల దాక ఎలాంటి అవాంఛనీయ ఘటనలుజరగలేదు.
