HomeTelanganaNizamabadమోడీ విధానాల ఎండగడుతుంటే ….ఆకునూరి మురళి ను అడ్డుకున్న వాకర్స్ …జై శ్రీరామ్ నినాదలతో హంగామా

మోడీ విధానాల ఎండగడుతుంటే ….ఆకునూరి మురళి ను అడ్డుకున్న వాకర్స్ …జై శ్రీరామ్ నినాదలతో హంగామా

టీఎస్ డిఎఫ్ ఆద్వర్యంలో శుక్రవారం ఉదయం ఐటిఐ‌ మైదానంలో నిర్వహించిన జాగో తెలంగాణ కార్యక్రమం రసాభాస అయింది. వాకింగ్ చేయడానికి వచ్చిన సామాన్య ప్రజానీకం చేసిన జై శ్రీరామ్ నినాదాలతో మైదానం మారుమోగింది.

అలాగే ప్రతీకగా స్థానిక న్యూ డెమెక్రసీ నేతలు బీజేపీ డౌన్ డౌన్ నినాదాలు చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక వ్యవస్థ పాకుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్థానిక న్యూ డెమెక్రసీ నేతలు ఆకుల పాపయ్య తో కలిసి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్వేష విభజన అప్రజాస్వామిక రాజకీయాలు ఓడించాలనే నినాదంతో ఐ టి ఐ గ్రౌండ్ లో ఓ సమావేశం నిర్వహించారు .

ఈ సందర్భంగా వారు బిజెపి ప్రభుత్వానికి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా వాకర్స్ అడ్డుకున్నారు..వాకర్స్ కు టీఎస్ డిఎఫ్ నేతలకు మద్య వాగ్వివాదం జరిగింది.. ఏ పార్టీకి వత్తాసు పలకడానికి మోడీ ఎలా తిడుతారంటూ వారు మండిపడ్డారు.

తాము ప్రజలను జాగృతం చేయడానికే ప్రయత్నిస్తున్నామని మురళి చెప్పారు. అసలు దేశంలో ఎలాంటి జుగుస్సాకరమైన రాజకీయాలు సాగుతున్నాయో ప్రజలు గమనించాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments