Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadనగరంలో బాజిరెడ్డి విస్తృత ప్రచారం

నగరంలో బాజిరెడ్డి విస్తృత ప్రచారం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 45వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ శాసనసభ్యులు శ్రీ గణేష్ బిగాల తో కలసి శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఫ్రీ బస్సు తప్ప చేసింది ఏమీ లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రుణమాఫీ లేదు, కళ్యాణ్ లక్ష్మీ లేదు, రైతు బంధు లేకుండా పోయిందన్నారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ చోద్యం చూస్తున్నారన్నారు కరెంటు రాక, నీళ్లు రాక పొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దేవుళ్ళ మీద ఓట్లు వేసి అబద్ధాలు చెబుతున్నారు బిజెపి ఎంపీ వచ్చిన 100 రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ ఇచ్చి ఐదు సంవత్సరాలైనా ఏమి చేయలేకపోయారు.

కరోనా టైంలో ప్రజలను ఆదుకునే శక్తి లేదు కానీ మళ్లీ పసువు బోర్డు చెప్పి ఓట్లు దండుకుందామని చూస్తున్నారు. కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారు. నగరంలో అడుగడుగునా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలని వేడుకుంటున్నారు ప్రచారం లో నగర మేయర్ దండు నీతు కిరణ్, 45వ డివిజన్ అధ్యక్షులు సూదం రవిచందర్,ప్రభాకర్ రెడ్డి,సుజాత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్,కరిపే రాజు తదితరులు పాల్గొన్నార

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!