వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కు ఏ ఏ ప్రాజెక్టు లు మంజూరు చేస్తామో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
జాతీయ పార్టీ ఇచ్చిన హామీలకు మరో 23 హామీల ను జోడించి శుక్రవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో మేనిఫెస్టోలో వివరించింది.
మోడీ సర్కార్ రద్దు చేసిన ఐటీఐఆర్ ను పున: ప్రారంభిస్తామని . పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు , మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా తీసుకువస్తామని హామీ ఇచ్చింది. నాలుగు నూతన సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీలలో ప్రకటించింది.
సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది .
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు అయిన ఏటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది.
ఈ ఐదు గ్రామాలను తెలంగాణలోకి తిరిగి తీసుకురావటం వల్ల భ్రదాచలంను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
అలాగే అయిదు పారిశ్రామిక వాడల ను హైదరాబాద్ -టూ- బెంగళరు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్
2. హైదరాబాద్ టూ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్
3. హైదరాబాద్ టూ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
4. హైదరాబాద్ టూ నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్
5. సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళిక లో తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది.