నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని పూటకొక మాట మాట్లాడుతుందని అసలు ఫ్యాక్టరీని తెరిపించే ఉద్దేశమే రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అర్థమవుతుందని నిజామాబాద్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు శుక్రవారం బిజెపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ కోసం 40 కోట్ల రూపాయలను మంజూరు చేయడం కమిటీని అవమానపరిచినట్లేనని ఎందుకంటే కమిటి ఎలాంటి అధ్యయనం చేయకుండానే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోయినా 40 కోట్ల రూపాయలు ఎలా మంజూరు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
అసలు కమిటీకి నేతృత్వం వహిస్తున్న మంత్రులు శ్రీధర్ బాబు దామోదర్ రాజనర్సింహతో పాటు శాసనసభ్యులకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నకమిటీ నుంచి ఉన్నపలంగా వైదొలగాలన్నారు. అంటే కమిటి నివేదికలకు సంబంధం లేకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్లడం అంటే కమిటీని అవమానపరిచినట్లేనన్నారు.
అసలు ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటని ఆయన నిలదీశారు. కేవలం ఎన్నికల కోసమే షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరలేపిందని ఆయన ధ్వజమెత్తారు. లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడి పోయిందని సర్వేలో స్పష్టం కావడంతో రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెర లేపారు న్నారు.
ఫ్యాక్టరీ ప్రారంభించే విషయంలో కమిటీ ముఖ్యమంత్రి తలోరకంగా మాట్లాడుతున్నారని. ప్రభుత్వ వేసిన కమిటీ ఫ్యాక్టరీని 2025 నాటికి తెరిపిస్తామని మాటిచ్చిందని.
రేవంత్ రెడ్డి మధ్యలో ఎంట్రీ అమ్మవారి సాక్షి అంటూ సెప్టెంబర్ 17 లోపు ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పారు. అసలు చెరుకు ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో కమిటీ ఎలాంటి అధ్యయనం చేసింది. సాంకేతిక సలహాలు తీసుకున్నారా? లేదంటే కేవలం ఎన్నికల కోసమే రూ 40కో మంజూరు చేశారా?