HomeTelanganaNizamabadషెడ్యూల్ కులాలలో వర్గీకరణ లేక నష్టపోతున్నాం..ఏకసభ్య కమిషన్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి..

షెడ్యూల్ కులాలలో వర్గీకరణ లేక నష్టపోతున్నాం..ఏకసభ్య కమిషన్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి..

షెడ్యూల్ కులాలలో వర్గీకరణ లేకపోవడం వలన మాదిగ కులాలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, పరంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నియమించిన ఏకసభ్య కమిషన్ షమీమ్ అక్తర్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.

గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఏకసభ్య కమిషన్ కు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ కులాలకు జరుగుతున్న అన్యాయాలపై తెలిపారు. ఆగస్టు1 న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షెడ్యూలలో ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమైందని తీర్పు ఇస్తూ..

ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ కులాలలో ఎస్సీలలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నది. మా జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని కోరారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకపోవడం వలన మాదిగలం తీవ్రంగా నష్టపోతున్నాం. మరియు ఎస్సీలలో ఉన్న 59 కులాలలో ఒక్క మాల కులానికి చెందిన వారే అభివృద్ధి చెందడం శోచనీయమని తెలిపారు.

మిగతా 58 కులాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వివరణ ఇచ్చారు.

దళితులలో ఉన్న అన్ని కులాలు అభివృద్ధి చెందాలంటే ఏకైక పరిష్కార మార్గం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడము అవసరమని అన్నారు.జనాభా నిష్పత్తి ప్రకారం షెడ్యూల్ కులాలలో ఉన్న 59 కులాలకు వారి వారి జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని వర్గీకరణ కొరకై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ షమీమ్ అక్తర్ కోరారు.

కార్యక్రమంలో లసింగారి భూమయ్య మాదిగ MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి, బండారి పోశెట్టి మాదిగ MRPS జిల్లా సహాయ కార్యదర్శి, బండారి రవి, తాడేం అబ్బయ్య లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments