వ్యవసాయ రంగంను మరింత ఊతం ఇవ్వడానికి ఆదర్శ రైతు వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ వెల్లడించారు.
ఉమ్మడి ఏపీ లో ఆదర్శ రైతు వ్యవస్థ ఉండేదని కానీ గత ప్రభుత్వం రద్దు చేసి సమన్వయ సమితి లను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆదర్శ రైతుల ను నియామకానికి ప్రభుత్వం సానుకూలంగా వుందని వ్యవసాయ కమిషన్ సైతం ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించిందన్నారు సీఎం రేవంత్ రైతులకు మరింత చేయూత ఇవ్వడానికి ఆదర్శ రైతులు ఉండాలనే పట్టుదలతో ఉన్నారని ఆయన స్పష్టం చేసారు.
గతంలో 16 నుంచి 17 వేలమంది ఆదర్శ రైతులుండేవారని కానీ ఈసారి ఎంత మంది ఉండలనే విషయంలో సమాలోచనలు జరుగుతున్నాయని 200 -250 మంది రైతులకు ఓ ఆదర్శ రైతు ఉండలా లేదంటే ఐదు వేల ఎకరాలకు ఒక ఆదర్శ రైతు ఉండలా అనేది ప్రభుత్వం ఖరారు చేస్తుందన్నారు.
అలాగే వ్యవసాయ విస్తరణ అధికారులనువెయ్యి ఎకరాలకు ఒకరిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలాగే గ్రామాల్లో సాగునీటి వివాదాల కు చెక్ పెట్టడానికి సాగునీటి సంఘాలను సైతం నియమించబోతున్నామని గంగాధర్ పేర్కొన్నారు
