HomeCRIMEనిజామాబాద్ అక్రమ దందా లపై ఉక్కుపాదం మోపుతాం .......ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ల...

నిజామాబాద్ అక్రమ దందా లపై ఉక్కుపాదం మోపుతాం …….ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ల ఫై నిరంతర నిఘా .. బెట్టింగ్ భూతం ను తరిమేస్తాం ……ఇది సంగతి తో కమిషనర్ సాయి చైతన్య

పోలీస్ కమిష నరేట్ పరిధిలోని ప్రాంతాల్లో అక్రమ దందా లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు శుక్రవారం ఇది సంగతి ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

నిజామాబాద్ నుంచి భారీఎత్తున రేషన్ బియ్యం మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించామని ఈ అక్రమ దందాలా వెనుక క్రియ శీలకంగా ఉన్న వారిని గుర్తించడం తో పాటు ఎక్కడెక్కడ నిల్వలున్నాయనేది అరా తీస్తామన్నారు. రాత్రుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తూ డంపులు చేస్తున్నారని ఈ అక్రమ దందా ను అరికట్టే విషయం లో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

ఇసుక డంపు ల సమాచారం వుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.జిల్లాలోని బోధన్,ఆర్మూర్,బాల్కొండ, కమ్మర్పల్లి వంటి ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక అడ్డుకట్ట వేయనున్నట్లు తెలిపారు.అలాగే ఇసుక అక్రమంగా రవాణా కాకుండా ఉండాలని సంబంధిత ప్రాంతాల అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు. .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా అం దించే పేదల బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ఠ నిఘా పెట్టాం.జిల్లా వ్యాప్తంగా పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నిందితుల పై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు.

అలాగే పీడీఎస్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న కొందరు ముఖ్య నిందితుల గుట్టు రట్టు చేసేవిధంగా ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు తెలిపారు.ఇక జిల్లాలో నియంత్రణ, అక్రమ దందాలకు అడ్డుకట్టే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు.మత్తు పదార్థాల రహిత కమిషనరేట్ తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

కమిషనరేట్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోగంజాయి రవాణా, అమ్మకాలు జరగద్దని, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఎట్టి పరిస్థి తుల్లో రెండు జిల్లాల పరిధిలో గంజాయి రవాణా తోపాటు అమ్మకాలు ఉండవని ఎంతటి.

వారినైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు . అలాగే జిల్లాలో మత్తుకు అలవాటు పడిన యువతకు కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. అలాగే ముఖ్యంగా జిల్లాలో విస్తృతం గా ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందని అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే గత సంవత్సరం ఎడపల్లి మండలంలోని బెట్టింగ్ గేమ్ ద్వారా మోసపోయి విద్యార్థులు ఆత్మ హత్యకు పడ్డారని తెలిపారు.

ఇలా ఎక్కడైనా ఆన్లైన్ బెట్టింగ్ లు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.అలాగే త్వరలోనే డయల్ యువర్ సీపీ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఇదివరకు ఈ కార్యక్రమం కోసం సోమవారం నిర్వహించేదని కానీ ఇకనుంచి ప్రజలకు వారం మొత్తం అందుబాటులో ఉంటుందని,బాధితులు ఎవరైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments