HomeTelanganaNizamabadవచ్చే ఏడాది మార్చిలోగా నక్సల్స్ ను అంతం చేస్తాం..- చేతుల్లో ఆయుధాలు ఉన్న వారితో చర్చలు...

వచ్చే ఏడాది మార్చిలోగా నక్సల్స్ ను అంతం చేస్తాం..- చేతుల్లో ఆయుధాలు ఉన్న వారితో చర్చలు ఎలా జరువుతాం- నిజామాబాద్ కిసాన్ సమ్మేళనం సభలో కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం

ఆదివాసులుండే అటవీ ప్రాంతాలను అల్లకల్లోం చేస్తున్న నక్సలైట్లను వచ్చే ఏడాది మార్చిలోగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయన ఆదివారం పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించినంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

అనేక మంది అమాయకులను హతం చేసిన నక్సలైట్ల విషయంలో ఏలాంటి సానుకూలత ఉండబోదన్నారు. అలాంటి వ్యక్తులతో చర్చలు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నక్సల్స్ మద్దతుగా మాట్లాడే వారు వారి బాధితుల కుటుంబాల పరిస్థితి తెలుసుకోవాలన్నారు. అయినా ఆయుధాలు చేతిలో ఉన్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు.

లొంగిపోవడం మినహా మరో మార్గం లేదని ఇప్పటికే రెండు వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని గుర్తు చేశారు. తెలంగాణ పాలకులకు ఎటిఎంగా మారిందని, గతంలో కెసిఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు.

కెసిఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా? లేదా అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు.ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం ఇస్తే కాని గత ప్రభుత్వం పెద్దల మీద ఏలాంటి కేసులు లేవన్నారు. కాని ఢిల్లీ కాంగ్రెస్ కు తెలంగాణ ఎటిఎంగా మారిందన్నారు.

అన్ని వర్గాల సహకారంతో తెలంగాణాలో కూడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట నెలబెట్టుకున్నారని అమిత్ గుర్తు చేశారు. మోడీ మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు.

40 ఏళ్ల పసుపు రైతుల కలను సాకారం చేశాడని బోర్డ్ కూడ నిజామాబాద్ లోనే ఏర్పాటు చేయడం శుభపరిమాణమన్నారు.

రాబోయే రోజుల్లో పసుపుకు నిజామాబాద్ కేంద్రంగా మారుతుందని అంతర్జాతీయ మార్కెట్లో నిజామాబాద్ పసుపుకు డిమాండ్ ఉండనున్నదన్నారు. పసువు ధర స్థిరంగా ఉండబోతుందని బోర్డు కూడ ఆదిశగానే పని చేస్తుందన్నారు.

ఈ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపిలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, దినేష్ కులచారి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments