గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జిల్లా రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితులను తెరిపించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి శ్రీధర్ బాబు నేతృతంలో కమిటీ ఏర్పాటు చేసిందని మెట్పల్లి బోధన్ ప్రాంతాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను పరిశీలించిందని ఆయన పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో జరిగిన జన జాతర సభలో ఆయన మాట్లాడారు లోకసభ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించితే రాబోయే ఇండియా కూటమి ప్రభుత్వంలో మంత్రి అవుతారని ఆయన హామీ ఇచ్చారు రైతుల సంక్షేమం గురించి ఆలోచించే జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి అయితే జిల్లా రైతుల బాగోగులను ఆయనే స్వయంగా చూసుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు అమలు చేస్తామన్నారు బాసర సరస్వతి అమ్మవారి సాక్షిగా తన మాట చెబుతున్నాను అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు అలాగే 500 రూపాయల బోనస్ కూడా కచ్చితంగా ఇచ్చి తీరుతామని రైతులు ఎంత మేరకు అయినా సరే వరి వేసుకోవచ్చుఅన్నారు 2004 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాష్కిని జిల్లా ప్రజలకు గెలిపిస్తే ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాస్ పోర్టు కార్యాలయం తో పాటు తెలంగాణ సాధించారని ఆయన గుర్తు చేశారు.
కానీ మరుసటి ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డ పోటీ చేశారని ఆమె వల్ల జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని ఆశతో గెలిపించారని వంద రోజుల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని కవిత కూడా హామీ ఇచ్చారని కానీ మోసం చేసిన నాయకులను రాజకీయ సమాధి చేయడం జిల్లా రైతులకు కొత్తవి కాదని ఆయన పేర్కొన్నారు.
అందుకే 2019 ఎన్నికల్లో కవితకు ఓటమితో గుణపాఠం చెప్పారని ఆయన గుర్తు చేశారు ఏనుగులు తినేవారు పోయి పినుగులు తినేవారు వచ్చారని ఆయన అర్వింద్ ను ఉద్దేశించి అన్నారు అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని జిల్లా పసుపు రైతులకు హామీ ఇచ్చిన అరవింద్ ఆ తర్వాత పసుపురైతులను ఆగం చేశారన్నారు ఆర్మూర్ రైతులు ఎంతో కాలంగా పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు .
కానీ పసుపు సంబంధించిన జీవో గందరగోళంగా ఉందని అసలు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తానన్నది ఆ ఉత్తర్వులలో పేర్కొనలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు కానీ జిల్లా పసుపు రైతులు అమాయకులు కాదని ఆ విషయాన్ని అరవింద్ తెలుసు కోవాలన్నారు కాన్వెంట్ స్కూల్లో చదివిన అరవింద్ కు రైతుల ఎంత చైతన్య వంతులో తెలియదన్నారు.
తండ్రి డి శ్రీనివాస్ ని అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు పంజాబ్ హర్యానాల తర్వాత ఆత్మగౌరవం పౌరుషము ఆర్మూర్ రైతుల్లో ఉంటుందని ఆయన గుర్తు చేశారు తమ సమస్యల పరిష్కారం కొరకు ఏ ప్రభుత్వ నైనా మెడల్ వంచే పోరాట స్ఫూర్తి ఆర్మూర్ రైతులకు సొంతమన్నారు వంద రోజులు చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోయిన బి ఆర్ ఎస్ ను గోతిలో పాతిపెట్టారని ఆయన గుర్తు చేశారు అలాగే ఐదు రోజుల్లో పసుపు పొడిని నమ్మబలికిన అరవింద్ కు ఎలాంటి గుణపాఠం చెప్తారని ఆయన ప్రశ్నించారు
మోడీకి ఓటమి భయం వెంటాడుతుందని అందుకొరకే రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే మాటలకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచిపెడుతుందంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవి అన్నారు కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిందనిఏనాడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన నిర్ణయాలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు






