జిల్లా స్థాయిలో ఐఏయస్ ఐపిఎస్ ల బదిలీ పక్రియ ఎట్టకేలకు పూర్తీ చేసిన రేవంత్ సర్కార్ ఇప్పడు రాష్ట్ర స్థాయి బదిలీ ల మీద దృష్టిపెట్టింది.
కొత్త పోలీసు బాస్ కోసం ప్రభుత్వ పెద్దలు ఎడతెగని కసరత్తులు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం డీజీపీ గా ఉన్న రవి గుప్తా ను మరికొంత కాలం కొనసాగిస్తారా లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది అధికార పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
డిజిపి గా రవిగుప్తా స్థానంలో సమర్ధుడైన మరో అధికారి కి డీజీపీ నియమించే యోచనలో సర్కార్ వుందని అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రవి గుప్త ను డీజీపీ గా ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడే నియమించింది.
కెసిఆర్ ప్రభుత్వం నియమించిన ఇంచార్జ్ డీజీపీ అంజనీ కుమార్ ఎన్నికల కోడ్ ఉల్లఘించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలితాలు వచ్చిన రోజు కలిశారు.
దీనితో ఆయన అదే రోజు డీజీపీ బాధ్యతల నుంచి తప్పించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే లోకసభ ఎన్నికల సందడి మొదలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి రవి గుప్తా నే పోలీస్ బాస్ కొనసాగిస్తూ వచ్చారు.
అనేక కీలక స్థానాల్లోకి కొత్త అధికారులను నియమించినా డీజీపీ గా మాత్రం రవి గుప్తా వైపే మొగ్గు చూపారు. అయితే లోకసభ ఎన్నికల కోడ్ తొలిగిపోవడంతో పాలనా వ్యవస్థలో తనదైన ముద్ర ఉండేలా రేవంత్ రెడ్డి కార్యాచరణ అమలు చేస్తున్నారు.
జిల్లా స్థాయిలో సమూల మార్పులు చేసారు. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రక్షాళన కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పోలీస్ బాస్ మార్పు జరుగుతుందని చెప్తున్నారు.
ఎన్నికల కమిషన్ నియమించిన రవి గుప్తా ను హోం శాఖ కార్యదర్శి గా నియమించి కొత్త డీజీగా సమర్ధుడైన మరో అధికారి ని నియమించే కసరత్తు శరవేగంగా సాగుతుంది. దీనితో పాటు ఖాళీగా ఉన్న రెండు డీజీ స్థానాలను సైతం భర్తీ చేసి ఆ వేంటనే డీజీపీ నియామకం చేపట్టాలని భావిస్తుంది.
కొత్త డీజీపీ లుగాఏసీబీ లో ఉన్న సీవీ ఆనంద్ తో పాటు విజిలెన్స్ డిజి జితేందర్ ఇంటలిజెన్స్ లో ఉన్న శివధర్ రెడ్డి పేర్లు కొత్త డీజీపీ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో శివధర్ రెడ్డి అదనపు డిజి హోదా లోనే ఉన్నారు కాబట్టి ఆయన్ను డిజి పి గా చేయడం వివాదం అవుతుంది.
అందుకే ఖాళీగా ఉన్న డిజి పోస్టులను భర్తీ చేసే పనిలో పడింది. శివధర్ రెడ్డి కి డీజీ గా పదోన్నతి ఇచ్చేసి ఆ తర్వాతే డీజీపీ గా నియామకం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.ఆనంద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికి ఆయన గత ప్రభుత్వ పెద్దలకు దగ్గర ఉన్నారనే అపవాదు ఉంది.
అందుకే శివధర్ రెడ్డి పేరు తెరమీదికి వచ్చింది. కానీ దాదాపు నలుగురు సీనియర్ అధికారులను కాదని శివధర్ రెడ్డికి డీజీపీ బాధ్యతలు ఇస్తే ఎలా వుంటుందనేది అరా తీస్తున్నారు. మరో వైపు ఇంటలిజెన్స్ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనేది కూడా చిక్కుముడే ఐజీ స్థాయిలో ఉన్న రమేష్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది.
హైదారాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సైతం విజిలెన్స్ బాధ్యతలు కావాలని కోరుతున్నారని ప్రచారం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఆయన్నే సీపీ గా కొనసాగించే యోచనలో ఉంది. ఆయనతో పాటు సైబరాబాద్ రాచకొండ కమిషనర్ లను సైతం యధావిధిగా కొనసాగించే ఆలోచనలో ఉంది.
ఇందులో సైబరాబాదు కమిషనర్ ను బదిలీ చేయాలని అధికార పార్టీ కీలక నేతలే ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.