ఇది జిజిహెచ్ ఆసుపత్రి తీరు..
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఓపీ కష్టాలు…
పేదలకు వైద్యం అందని ద్రాక్షేనా..?
ఓపీకే గంటల తరబడి సమయం వృధా..
ఇక్కట్లకు గురవుతున్న ప్రజలు..
జీజీహెచ్‌కు పెరిగిన రోగుల సంఖ్య..
నిజామాబాద్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ అనారోగ్య సమస్యలతో అసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే ఉంటున్నాయి.
ఓపీ సేవలు అందక, గంటల కొద్దీ వరుసల్లో నిలబడలేక బాధితులు నీరసించిపోతున్నారు. ఓపీ చిట్టి చేసుకొచ్చే వరకు వైద్యం అందించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితోపేదలకు వైద్యం అందని ద్రాక్ష గా నెలకొంది. కొందరు రోగులు వరుసల్లో నిల్చోలేక, వారి వెంట తోడుగా వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను తెచ్చుకుంటున్నారు.
ఊళ్ల నుంచి రావడం ఒక ఎత్తైతే, ఓపీ సేవల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయడం మరో ఎత్తు అవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజీహెచ్ (ప్రభుత్వాసుపత్రి)లో రోగులకు అందే వైద్య సేవల మాటెలా ఉన్నా ఓపీ కష్టాలు మాత్రం తీరడంలేదు. ఓపీ (అవుట్‌పేషెంట్) విభాగంలో చీటీలు రాయించుకోవడానికి రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం తొమ్మిదింటికే ఆసుపత్రికి వస్తున్నా ఓపీ చీటీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఉదయం తొమ్మిదింటికే ఆసుపత్రికి వస్తున్నా ఓపీ చీటీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రోగుల వివరాల ఆన్లైన్ లో ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయడానికి విపరీతమైన జాప్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
సమయం అంతా ఓపీ చీటీలు రాయించుకోవడానికే సరిపోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లే సరికి మరింత నీరసించిపోతున్నారు. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి నుంచి పాము కాటుకు గురైన బాధపడుతున్న వ్యక్తినీ చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ సరైన వైద్యం అందక మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ రోగి వైద్యం కోసం ఓపీ తీసుకొచ్చే వరకు వైద్యం అధించక డాక్టర్లు జాప్యం చేస్తోన్నారు. అందుకు ఓ విలేకర్ అక్కడ ఉన్న సంబంధిత డాక్టర్లకు వివరాలు తెలుసుకోగా వారు బెదిరింపులకు దిగారు.