రేవంత్ సర్కార్ రాష్ట్రం పాలనా వ్యవస్థ ను సమూలంగా ప్రక్షళన చేసింది. ఐ ఏ యస్, ఐపిఎస్ అధికారుల ను భారీఎత్తున బదిలీ లు చేసింది . ముఖ్యంగా జిల్లాస్థాయిలో పాలన వ్యవస్థ ను సర్కార్ ప్రక్షాళన చేసింది.
డైరెక్ట్ ఐఏయస్ ఐపిఎస్ లనే కలెక్టర్ ఎస్పీ కమిషనర్ లకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కలెక్టర్ కమిషనర్ ఎస్పీ లుగా నియమించింది.
దశాబ్ద కాలం తర్వాత నిజామాబాద్ జిల్లాకు కలెక్టర్, కమిషనర్ లుగా ఈ తరహా పోస్టింగ్ లు జరిగాయి. జిల్లాసారథులు గా ఉండే కమిషనర్ కలెక్టర్ లను బదిలీ చేయలేదు.
కమిషనర్ గా కల్మేశ్వర్ కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హన్మంత్ లే కొనసాగనున్నారు. వీరి పోస్టింగ్ లు పొందిన నుంచి వరుస ఎన్నికల నిర్వహణ లో తలమునికలై ఉన్నారు.
సాధారణ పాలన వ్యవహారాలమీద సీరియస్ గా దృష్టి పెట్టి తమదైన ముద్ర వేసుకొనే పరిస్థితి లేకుండా పోయింది. రాజీవ్ గాంధీ గత ప్రభుత్వ హయాంలోనే కలెక్టర్ గా నియామకం అయ్యారు.
అదికూడా అసెంబ్లీ ఎన్నికల పక్రియ మొదలవ్వడానికి కొద్దీ రోజుల ముందే.అయినప్పటికి ఎన్నికల పక్రియ పూర్తియ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేస్తారని యంత్రాంగంలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
పాలన వ్యవహారాల్లో ఆయన ఎవ్వరి మాట పట్టించుకోరు అనే చర్చ ఉంది. అందుకే ఆయన బదిలీ అనివార్యం అని భావించారు. అలాగే పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ విషయంలోనూ అదే చర్చ జరిగింది.
ఎందుకంటే శాంతి భద్రతల నిర్వహణలో ఆయన కఠినంగా వుండడం నేరస్తుల విషయంలో ఉక్కుపాదం మోపడం కొంత మంది అధికార పార్టీ అగ్ర నేతలకు మింగుడు పడలేదు దీనితో ఆయన కూడా బదిలీ అవుతారని కూడా ప్రచారం జరిగింది.
మొదట ఆయన బదిలీ అనివార్యం అని బావించారు కానీ మరికొంత కాలం ఆయన్ను కొనసాగించాలని అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి పట్టుబట్టి నట్లు సమాచారం.ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటి అరాచక ల మీద ఉక్కు పాదం మోపడం ఫై సదురు మాజీ మంత్రి .
ఏకంగా సీఎం వద్దే ప్రస్తావించారని తెల్సింది.అందుకే ఆయన కల్మేశ్వర్ వైపే మొగ్గు చూపారని సమాచారం. వ్యక్తిగతంగా కల్మేశ్వర్ కూడా మాజీ మంత్రి ని కలసి నట్లుగా సమాచారం.
పదేళ్ల బిఆర్ యస్ పాలన లో జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ అదుపు తప్పాయనే ఆలోచనలో ఉన్న మాజీ మంత్రి కల్మేశ్వర్ కంట్రోల్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు.
ఎస్సై సీఐ ల బదిలీ ల్లా వ్యవహారాల్లో కమిషనర్ తమ సిఫారస్ లు బుట్టదాఖలు చేయడం ఫై కొందరు అధికార పార్టీ సీనియర్ నేతలు సదురు మాజీమంత్రి కి చెప్పారు. దీనితో లోకసభ ఎన్నికల తర్వాత కల్మేశ్వర్ బదిలీ అవుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
అసెంబ్లీ ఎన్నికల పక్రియ మొదలయ్యాక కల్మేశ్వర్ ను నిజామాబాద్ సీపీ గా ఎన్నికల కమిషన్ నియమించింది. అందుకే ఆ ఎన్నికల్లో నిక్కచ్చిగా పనిచేసారు శాంతిభద్రతల నిర్వహణలో ఆయన కఠినంగా ఉండడం కాంగ్రెస్ ముఖ్య నేతలకు సానుకూలంగా మారింది .
ముఖ్యంగా బిఆర్ యస్ ఎమ్మెల్యే లు దూకుడు కు బ్రేక్ పడింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కల్మేశ్వర్ ను యధావిధిగా కొనసాగించింది.
అసెంబ్లీ లోకసభ ఎన్నికల ను సమర్దవంతంగా నిర్వహించారు. జిల్లా సారధులు ఇద్దరీ ని ప్రభుత్వం యధావిధిగా కొనసాగించబోతుంది. యువ అధికారులు ఇద్దరు ఇప్పుడు ఎన్నికల విధులనుంచి బయట పడ్డారు.
రాబోయే రోజుల్లో జిల్లాలో పాలన ఇక పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నారు.