ఆర్డరాత్రి దాక సాగె వ్యాపార కార్యకలాపాలఫై రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి మరీ ఉక్కుపాదం మోపిన నగర పోలీసులు ఆక్రమణల తొలగింపు లో ఆపసోపాలు పడుతున్నారు.
అడుగడుగునా ప్రతిఘటన లు ఎదుర్కుంటున్నారు. కొమ్ములు తిరిగిన రౌడీ మూకకు యూపీ తరహా ట్రీట్ మెంట్ ఇచ్చిన ఘనత ఉన్న నగర పోలీసులు అక్రమణ దారుల నిలదీత లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు నిజామాబాద్ నగరంలోని ప్రధాన రోడ్ల కు ఇరువైపుల ఉన్న ఆక్రమణలపై ట్రాఫిక్ యంత్రాంగం గత కొద్దీ రోజులుగా కొరడా ఝలిపిస్తుంది.
నగరంలో పలు ప్రాంతాల్లో పాదాచారులు నడిచేందుకు వీలు లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితినీ చక్కదిద్దేందుకు కొత్తగా వచ్చిన ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ తో పాటు సీఐ లు రంగంలోకి దిగారు ఆయా ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు.
గతంలో ఎన్నడు లేనివిధంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు పటిష్టంగా చేశారు.అలాగే పలు ప్రధాన కూడళ్ల వద్ద పటిష్టంగా బారికేడ్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు చొరవ తీసుకున్నారు.అలాగే నగరంలోని అత్యనత రద్దీగా ఉండే ప్రధాన ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు పై కఠినమైన చర్యలు తీసుకున్నారు.
రోడ్డు ఆక్రమణతో ప్రజలు,వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ వీటి తొలగింపుతో ట్రాఫిక్ రద్దీనీ తగ్గించేందుకు దోహదపడుతుందని చర్యలు చెప్పారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఆక్రమణ తొలగింపు చెప్పారు.
దీంతో స్థానిక దుకాణదారులు అధికార పార్టీ నేతల అండదండలతో మూకుమ్మడిగా ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగారు.కుమార్ గల్లి, అహ్మద్ బజార్ ఆక్రమణ తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది.
ప్రధానంగా కుమార్ గల్లి, అహ్మద్ బజార్ ప్రాంతాల్లో వాహనాలు వెళ్లకుండా షాపుల వరకు కాకుండా రోడ్డు ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమణాలపై వాటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ముందస్తు సూచనలు చేశారు.
అయిన వారు వినకుండా స్థానిక అధికార పార్టీ నేతలతో కలిసి పోలీసులపై వాదనకు దిగారు. ఈ మేరకు ఏసిపి మస్తాన్ అలీ రంగంలోకి దిగి అధికారుల విధులకు ఆటంకం కలిగించిన స్థానిక నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
