రాష్ట్రం పాలనా వ్యవస్థ ప్రక్షళన కు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్ ఐ ఏ యస్ ఐపిఎస్ అధికారుల ను భారీఎత్తున బదిలీ లు చేయడానికి కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా కలెక్టర్ ల బదిలీ ఉత్తర్వ్యూలు వచ్చాయి.
ఒకటిరెండు రోజుల్లో ఐపిఎస్ ల బదిలీలు కూడా జరుగనున్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది.
మొదట ఆయన బదిలీ అనివార్యం అని బావించినప్పటికి ఇప్పడు ఆయన మరికొంత కొంత కాలం కొనసాగవచ్చుని సమాచారం. ఆయన భార్య నార్త్ జోన్ హైదారాబాద్ డీసీపీగా కొనసాగుతున్న నేపథ్యంలో కల్మేశ్వర్ సైతం హైదారాబాద్ వెళ్ళడానికి ఆసక్తి చూపెట్టారు.
కానీ నిజామాబాద్ కొత్వాల్ ఆయన్ను కొనసాగించాలని అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి పట్టుదల గా ఉన్నారు. ఆయన గట్టిగా పనిచేస్తున్నారని సన్నిహితులతో అంటున్నారు. పాలనా వ్యవస్థ లో కీలకంగా మారిన మాజీ మంత్రి కల్మేశ్వర్ కు వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం.
వ్యక్తిగతంగా కల్మేశ్వర్ కూడా మాజీ మంత్రి ని కలసి నట్లుగా సమాచారం. పదేళ్ల బిఆర్ యస్ పాలన లో జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ అదుపు తప్పిందనే ఆలోచనలో ఉన్న మాజీ మంత్రి కల్మేశ్వర్ కంట్రోల్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు.
మరో బదిలీ వ్యవహారాల్లో కమిషనర్ తమ సిఫారస్ లు బుట్టదాఖలు చేయడం ఫై కొందరు సీనియర్ నేతలు సదురు మాజీమంత్రి కి చెప్పారు. దీనితో లోకసభ ఎన్నికల తర్వాత కల్మేశ్వర్ బదిలీ అవుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
అసెంబ్లీ ఎన్నికల పక్రియ మొదలయ్యాక కల్మేశ్వర్ ను నిజామాబాద్ సీపీ గా ఎన్నికల కమిషన్ నియమించింది. అందుకే ఆ ఎన్నికల్లో నిక్కచ్చిగా పనిచేసారు శాంతిభద్రతల నిర్వహణలో ఆయన కఠినంగా ఉండడం కాంగ్రెస్ ముఖ్య నేతలకు సానుకూలంగా మారింది.
ముఖ్యంగా బిఆర్ యస్ ఎమ్మెల్యే లు దూకుడు కు బ్రేక్ పడింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కల్మేశ్వర్ ను యధావిధిగా కొనసాగించింది.
అసెంబ్లీ లోకసభ ఎన్నికల ను సమర్దవంతంగా నిర్వహించిన ఆయను ఏడాది లోపే బదిలీ చేయడం ఫై ప్రభుత్వ పెద్దలు సైతం సానుకూలంగా లేకుండే.
నేరాల నియంత్రణలో సీపీ దూకుడు గా పనిచేస్తుండడం కూడా మాజీ మంత్రి బాగా నచ్చింది. అందుకే ఆయన మరికొంత కాలం కొనసాగుతారని సన్నిహితులకు చెప్తున్నారని తెల్సింది.