శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనీ అన్ని వైన్స్లు,బార్లు ఆదివారం బంద్ చేయాలని సిపి సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీరామ నవమి శోభాయాత్రల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఏప్రిల్ 06 ఉదయం 6 గంటల నుండి తేదీ 07 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.