గంజాయి విక్రయిస్తున్న యువకుడునీ పట్టుకొని అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
సాలంకే రత్నదీప్ నాగారంలోని డ్రైవర్స్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్నట్లూ విశ్వసనీయ సమాచారం మేరకు ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
అతని వద్ద 15 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
