HomeTelanganaNizamabadహోరాహోరీగా యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ....ఆన్ లైన్ లోనే ఓటింగ్ .....జిల్లా అధ్యక్ష రేసు లో...

హోరాహోరీగా యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ….ఆన్ లైన్ లోనే ఓటింగ్ …..జిల్లా అధ్యక్ష రేసు లో అయిదు గురు ….. ఇద్దరి మద్యే పోటీ

పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం లో ఎన్నికలకు రసవత్తరంగా మారాయి.యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవీ కోసం హోరా హోరీ పోరు జరుగుతుంది.

శనివారం సాయంత్రం అయిదు గంటలకే ఓటింగ్ పక్రియ పూర్తీ అయింది. ఫలితాలు దాదాపు 20 రోజుల తరవాతే వెల్లడిస్తారు. 18 నుంచి 35 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న యువకులు మొదట యూత్ కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకున్నాకే ఎన్నికల పక్రియ మొదలయ్యంది.

యూత్ అధ్యక్ష పదవీ తమ అనుయాయులకు దక్కించుకోవడానికి సీనియర్ నేతలు సైతం రంగంలోకి దిగి పావులు కదుపుతున్నారు. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ ల కు నలుగురు యూత్ పోస్టు కోసం తలపడుతున్నారు.

నిజామాబాద్ అర్బన్ నుంచి అద్నాన్ విపుల్ గౌడ్ లతో పాటు నిజామాబాద్ రూరల్ నుంచి సాయికృష్ణ ఆర్మూర్ నుంచి శ్రీకాంత్ బాల్కొండ నుంచి నాగేంద్ర లు జిల్లా అధ్యక్ష పదవీ కోసం పోటీ పడ్డారు.

ఇందులో విపుల్ గౌడ్ నాగేంద్ర ల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments