నిజామాబాద్ నగరానికి చెందిన వరదబట్టు వేణు రాజ్ ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేణు రాజ్ ను రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన జాతీయ మరియు రాష్ట్ర కమిటీ నాయకులకు మరియు నా నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ననికాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లభిస్తుందనడానికి నేనే ఉదాహరణ అని ,గిరిరాజ్ కళాశాలలో ఎన్.ఎస్.యు.ఐ నాయకుడిగా మొదలైన ప్రస్థానం జిల్లా అధ్యక్షుడిగా అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి నేడు రాష్ట్ర ఉపాధ్యక్షుడి స్థాయి వరకు వచ్చానంటే అది కేవలం క్రమశిక్షణ, నిబద్ధత , అంకితభావం కలిగిన కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ గుర్తించడం వల్లే సాధ్యమైందని అన్నారు.
ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన వేణురాజ్ ను పలువురు అభినందించడంతోపాటు ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
