నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ప్రో పెసర జయ శంకర్ అగ్రి కల్చర్ యూనివర్సిటీ లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధి ఆత్మ హత్య కు పాల్పడింది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన రక్షిత శనివారం కాలేజీ హాస్టల్ భవనం లో బాత్ రూమ్ లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. తోటి విద్యార్థినీలు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి రుద్రూర్ పోలీసులు వచ్చారు.
రక్షిత ఎనిమిది రోజుల క్రితమే హాస్టల్ లో చేరింది. ఆత్మ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు