నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఓ యువతి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో లైంగిక వేధింపులుఎదుర్కొంది.ఈ మేరకు బాధిత మహిళా గచ్చిబౌలి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. నెదర్లాండ్స్ నుంచి భారత్‌కు వచ్చిన యువతి.. కొండాపూర్‌లో కో లివింగ్ హాస్టల్లో తన స్నేహితుడి తో కలిసి ఉంటుంది.
అక్కడ ఉంటున్న మరో యువకుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తాను నెదర్లాండ్స్‌కు వెళ్ళాక అక్కడ భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా చెప్పింది . మూడు రోజుల క్రితం మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన బాధితురాలు..
గచ్చిబౌలి పోలీసులను కలిసి జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
