ఖైరతాబాద్ నియోజకవర్గం :జూబ్లీహిల్స్ డివిజన్ బసవ తారక నగర్ – ఎంజీ నగర్ ను ఆనుకుని ఉన్న నాలామురుగు, వ్యర్ధాలు తో నిండిపోయి మురుగు నీరు బయటికి రావడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయం తెలిసిన జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్డండ వెంకటేష్ వెంటనే జిహెచ్ ఎంసీ సిబ్బంది మరియు వాటర్ & సివరేజ్ సిబ్బంది ని అప్రమత్తం చేసి నాలా పూడిక తీత పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
అనంతరం సిబ్బంది నాలా పూడిక తీత పనులనుశనివారం ప్రారంభించడంతో, అక్కడ బస్తీ వాసులు సంతోషం వ్యక్తం చేసి కార్పొరేటర్ కి కృతజ్ఞతలు తెలిపారు
