కామారెడ్డిలోని పట్టణం లో పట్టపగలే రోడ్డుమీద హత్య జరిగింది నిజాంసాగర్ చౌరస్తా వద్ద దారుణం చోటు చేసుకుంది. నర్సింహులు అనే వ్యక్తి ఆయన భార్య మహేశ్వరి(48)ను అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.
అనంతరం నర్సింహులు సైతం పొడుచుకున్నాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏఎస్పీ చైతన్య, సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
