సరుకుల ఎగుమతి అవసరాల మేరకు జిల్లాలో కంటెనర్ డిపో నిర్మించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాదు అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో బృందం శనివారం నిజామాబాద్ వచ్చిన రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజ్ రమేష్ కలిసి నిజామాబాదు వర్తకుల సమస్యలను ప్రస్తావించారు.
సరుకుల ఎగుమతుల గురించి కంటైనర్ డిపో అవసరాన్ని వివరించగ, వెంటనే కంటైనర్ డిపోని అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. డిచ్ పల్లి లో కాని జానకంపేట లో కాని అతిత్వరలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇతర రైల్వే ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రముఖ పసుపు వ్యాపారస్థులు రమేష్ గుప్తా, ఆకుల సందీప్ మరియు కార్యదర్శి కమల్ ఇనాని, పాల్గొన్నారు. మనం జిల్లాకు కంటైనర్ డిపో రావడం గొప్ప విషయమని సరుకులు తొందరగా పంపడానికి వీలవుతుందని ఛాంబర్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసారు.
